ఆర్యా,

ఈ దేశంలో తమని రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారన్న భావన హిందువులలో      పెరుగుతోంది. దీనికి కారణభూతమైన చర్యలు, బహుశా యాదృచ్చికంగా జరిగిన, అవి మన రాజ్యాంగ నిబంధనలు మరియు వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పులపై నిర్మితమైన చట్టాల వల్ల జరిగినవే. పర్యవసానంగా, భారతదేశంలో హిందువుగా ఉండటంవల్ల వర్తించె వైకల్యాల నుండి స్వేచ్ఛను పొందేదుకు తమను “హైందవేతరులు” గా గుర్తించాలని కోరే వర్గాలు నిరంతరంగా పెరుగుతున్నాయి.

కేవలం హిందువులకు మాత్రమే రాష్ట్ర జోక్యం లేకుండా విద్యాసంస్థలను నడిపించుకునె హక్కు లేదు. కేవలం హిందువులకు మాత్రమే తమ స్వంత దేవాలయాలను తాము నిర్వహించుకునే హక్కు లేదు. ఇక ఇప్పుడు విద్యాభృతి మరియు ఇతర ప్రయోజనాలు కూడా హైందవేతరులకు మంజూరు చేస్తూ, కేవలం హిందువులకు మాత్రం తిరస్కరిస్తున్నారు. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన మరియు రాజ్యాంగ సభచే దర్శించబడిన, మతానికి అతీతంగా పౌరులందరికి సమానత్వం, అనే ప్రాథమిక ఆలోచనకు వ్యతిరేకంగా ఇదంతా జరుగుతోంది. ఇలా రాజ్యాంగ అంశాలు కూడా వేర్పాటువాద, మత రాజకీయల కోసం మరియు హిందూ సమాజాన్ని విభజించడానికె ఉపయోగించబడుతున్నాయి. లింగాయతులను “హైందవేతరులు” గా ప్రకటించటం ఇలాంటిదే, హైందవేతరులకు ఇవ్వబడిన చట్ట సౌలభ్యాల ద్వారా ప్రయోజనాలు పొందటం కోసేమే ఇదంతా జరుగుతోంది.

జాతీయ ఐక్యత మరియు సామాజిక సామరస్యం కోసం, వేర్పాటువాద మరియు మతోన్మాదా శక్తుల కట్టడి కోసం మరియు భారతదేశపు ఆర్ధిక సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, ఈ దిగువ సంతకం చేసిన మేము, హిందువుల యథార్థమైన సమస్యలను పరిష్కరించడానికి, ఈ క్రింద పేర్కొన్న చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. తద్వారా హిందువులకు, ఒక న్యాయమైన, నిష్పక్షపాతమైన రాజ్యాంగం నందు మరియు చట్ట వ్యవస్థ యందు విశ్వాసాన్ని పునరుద్ధరింపచేయాలని, అలాగే రాబోయే 2019 ఎన్నికలలో తమ సమస్యలకు ప్రాముఖ్యత ఉందన్న ఉత్సాహాన్ని కలిగించాలని కోరుతున్నాం.